భారతదేశం, ఏప్రిల్ 22 -- భారతీయులు ఆహార ప్రియులు. వారికి సీజనలిటీ పెద్ద సమస్య కాదు. ఏ సమయంలోనైనా అన్ని ఆహారాన్ని తినాలనే మనస్సు మనవారికి ఉంటుంది. సీజన్ ప్రకారం ఇదే ఆహారం తినాలనేమి నియమాలు పెట్టుకోరు. ముఖ్యంగా తెలుగు రాష్ట్రాల్లో అయితే స్పైసీ ఫుడ్ నిత్యం తింటారు. చికెన్ నుండి అనేక రకాల వంటకాలు తయారు చేయవచ్చు. చికెన్‌ని పులుసులో తినకుండా కాస్త డ్రైగా తినాలనుకుంటే ఈ చికెన్ ఫ్రైని ప్రయత్నించవచ్చు.

చికెన్ ఫ్రైని సరైన విధానంలో వండితే మంచి రుచి వస్తుంది. కింద చెప్పే పద్ధతిలో వండి చూడండి. బాగుంటుంది. ఈ ఫ్రైని ఎలా చేయాలి? అని ఆలోచిస్తున్నారా? చాలా సింపుల్‌గా చేసేయెుచ్చు. సమయం కూడా ఎక్కువగా తీసుకోదు. దాని తయారీకి కావలసిన పదార్థాలు ఏంటి? ఆ రెసిపీ ఏంటో చూద్దాం..

చికెన్ - 500 గ్రాములు, ఉల్లిపాయ-2, పచ్చిమిర్చి - 2, ఉల్లిపాయ - 1/4 స్పూన్, జీలకర్ర - 1/4...