భారతదేశం, సెప్టెంబర్ 5 -- మిడ్​ రేంజ్​ ఎస్‌యూవీ మార్కెట్​లో కొత్త సంచలనం సృష్టించే లక్ష్యంతో, మారుతీ సుజుకీ తన సరికొత్త ఎస్‌యూవీ 'విక్టోరిస్'ను ఇటీవల ఆవిష్కరించింది. స్మార్ట్ హైబ్రిడ్, స్ట్రాంగ్ హైబ్రిడ్, ఎస్-సీఎన్‌జీ వంటి పలు పవర్‌ట్రైన్ ఆప్షన్లతో ఇది విస్తృత శ్రేణి కస్టమర్లను ఆకట్టుకుంటోంది. ఇప్పుడు, కంపెనీ అధికారికంగా ఈ మోడల్ మైలేజ్​ వివరాలను వెల్లడించింది. ఈ గణాంకాలు నిజంగా ఆసక్తికరంగా ఉన్నాయి.

మారుతీ సుజుకీ విక్టోరిస్ 1.5-లీటర్ కె-సిరీస్ పెట్రోల్ ఇంజిన్‌తో వస్తుంది.

మ్యాన్యువల్ ట్రాన్స్‌మిషన్ మోడల్ లీటరుకు 21.18 కిలోమీటర్ల మైలేజ్​ని ఇస్తుంది (కంపెనీ పేర్కొన్నది).

ఆటోమేటిక్ వేరియంట్ లీటరుకు 21.06 కిలోమీటర్ల మైలేజ్​ని అందిస్తుంది (కంపెనీ పేర్కొన్నది).

ఇక, ఏఎల్‌ఎల్‌జీఆర్‌ఐపీ (ALLGRIP) 4x4 ఆటోమేటిక్ వేరియంట్‌కు మైలేజ్ లీటరుకు 19.07 క...