భారతదేశం, సెప్టెంబర్ 15 -- భారతదేశ కాంపాక్ట్ ఎస్‌యూవీ మార్కెట్​లో మారుతీ సుజుకీ విక్టోరిస్ సరికొత్తగా అడుగుపెట్టింది. ఈ కారు మార్కెట్‌లో అత్యంత పోటీ ఉన్న సెగ్మెంట్​లోని ఎస్‌యూవీలకు గట్టి పోటీ ఇస్తుందని మారుతీ చెబుతోంది. ఇప్పటికే ఈ మోడల్​పై కస్టమర్ల ఆసక్తి పెరిగింది. ఈ నేపథ్యంలోనే మరుతీ సుజుకీ విక్టోరిస్​ వేరియంట్లు, వాటి ఫీచర్ల గురించి తెలుసుకోవాలనుకుంటున్నారు. కాగా విక్టోరిస్​లో వాల్యూ ఫర్​ మనీ వేరియంట్​ ఏది? అని కూడా అన్వేషిస్తున్నారు. ఎంట్రీ-లెవల్ ఎల్​ఎక్స్​ఐ మోడల్‌కు మించి ఫీచర్లు కోరుకునే వారికి వీక్స్​ఐ వేరియంట్ చాలా ఆకర్షణీయంగా కనిపిస్తోంది. ఇది బేస్ మోడల్ కన్నా కొంచెం ఖరీదైనదైనా, మెరుగైన ఫీచర్లను అందిస్తూ మధ్యస్థ ధర, ప్రీమియం ఫీచర్ల మధ్య ఉన్న అంతరాన్ని పూడ్చే ప్రయత్నం చేస్తోంది. ఫలితంగా వాల్యూ ఫర్​ మనీ వేరియంట్​గా నిలిచింది. ఈ నేప...