భారతదేశం, మార్చి 2 -- మారుతి సుజుకికి భారత్‌లో మంచి డిమాండ్ ఉంది. పెద్ద పెద్ద కంపెనీలతో పోటీ పడుతూ.. కార్ల అమ్మకాల్లో అగ్రస్థానంలో ఉంటుంది. గత నెల 2025 ఫిబ్రవరిలో 1,60,791 కార్లను విక్రయించడం ద్వారా మారుతి సుజుకి మరోసారి దేశీయ మార్కెట్లో అగ్రస్థానాన్ని సాధించింది. అయితే మారుతి సుజుకి కార్ల అమ్మకాలు ఏడాది ప్రాతిపదికన కేవలం 0.32 శాతం మాత్రమే పెరిగాయి. సరిగ్గా ఏడాది క్రితం అంటే 2024 ఫిబ్రవరిలో మారుతి సుజుకికి 1,60,271 కొత్త కస్టమర్లు వచ్చారు.

మరోవైపు మారుతీ సుజుకి కార్ల అమ్మకాలు నెలవారీ ప్రాతిపదికన 7.38 శాతం క్షీణించాయి. జనవరి 2025లో మారుతి సుజుకి దేశీయ మార్కెట్లో మొత్తం 1,73,599 వినియోగదారులను పొందింది. అదే సమయంలో మారుతి కార్ల ఎగుమతులు కూడా గత నెలలో క్షీణించాయి.

మారుతి సుజుకి మిడ్-సైజ్ సెడాన్ సియాజ్ మొత్తం 1,097 కొత్త కస్టమర్లను అందుకుంది...