భారతదేశం, మార్చి 17 -- వినియోగదారులకు మళ్లీ షాక్​ ఇచ్చింది దేశీయ దిగ్గజ ఆటోమొబైల్​ సంస్థ మారుతీ సుజుకీ. తమ పోర్ట్​ఫోలియోలోని వాహనాల ధరలను పెంచనున్నట్టు ప్రకటించింది. 2025 ఏప్రిల్​ నుంచి తాజా రేట్లు అమల్లోకి వస్తాయని రెగ్యులేటరీ ఫైలింగ్​ ద్వారా వెల్లడించింది. మారుతీ సుజుకీ ఈ ఏడాదిలో తన వాహనాల ధరలను పెంచడం ఇది మూడోసారి!

2025 జనవరిలో, మారుతీ సుజుకీ కార్ల ధరలు నాలుగు శాతం పెరిగాయి. ఫిబ్రవరిలో మళ్లీ వాహన తయారీదారు తన కార్లపై ధరలను పెంచింది. అప్పుడు మారుతీ సుజుకీ కార్ల ధరలు ఒక శాతం నుంచి నాలుగు శాతం వరకు పెరిగాయి.

ఇక 2025 ఏప్రిల్ నుంచి అమల్లోకి రానున్న తాజా ధరల పెంపునకు ఇన్​పుట్​ ఖర్చులు, నిర్వహణ ఖర్చులు పెరగడమే కారణమని ఆటో కంపెనీ పేర్కొంది. ఏ మోడల్ ఎంత ధర పెరుగుతుందో మారుతీ సుజుకీ ఇంకా వెల్లడించలేదు. త్వరలోనే దీనిపై క్లారిటీ వచ్చే అవకాశం ఉంద...