భారతదేశం, జనవరి 26 -- మారుతి సుజుకి కంపెనీకి భారత్‌లో మంచి డిమాండ్ ఉంది. బడ్జెట్ ధరలో కార్లు విక్రయించడం ద్వారా ఈ కంపెనీ మార్కెట్‌లో తనదైన ముద్ర వేసుకుంటుంది. ఇటీవలే ఆటో ఎక్స్‌పో 2025లో ఈ విటారా ఎలక్ట్రిక్ ఎస్‌యూవీని ఆవిష్కరించింది. మరికొద్ది నెలల్లో ఈ కారు మార్కెట్‌లోకి ఎంట్రీ ఇచ్చే అవకాశం ఉంది. ఈ ఏడాది లేదా వచ్చే ఏడాది వివిధ సరికొత్త హ్యాచ్‌బ్యాక్‌లు, ఎస్‌యూవీలు, ఎంపీవీలను విడుదల చేసేందుకు రెడీ అవుతోంది. ఆ లిస్టులో ఏమేం ఉన్నాయో చూద్దాం..

ఈ ఎస్‌యూవీ ఏప్రిల్ 2023 నెలలో ప్రారంభమైంది. మంచి డిజైన్, ఫీచర్ల కారణంగా ఎక్కువ సంఖ్యలో అమ్ముడైంది. కారును కూడా అప్‌డేట్ చేసి అమ్మకానికి తీసుకువచ్చేందుకు రెడీ చేస్తోంది. కొత్త కారు 2026 లేదా 2027లో విడుదలయ్యే ఛాన్స్ ఉంది. అందుబాటులో ఉన్న కొత్త మారుతి సుజుకి ఫ్రాంక్స్ ధర కనిష్టంగా రూ.7.51 లక్షలు, గరిష్టం...