భారతదేశం, ఫిబ్రవరి 15 -- ఇండియాలో బెస్ట్​ సెల్లింగ్​ ఎస్​యూవీల్లో మారుతీ సుజుకీ బ్రెజా ఒకటి. దీనిని ఒక ఫ్యామిలీ ఎస్​యూవీగా ప్రజల్లోకి తీసుకెళ్లిన సంస్థ మంచి సక్సెస్​ని చూసింది. ఇకప్పుడు బ్రెజా ధరను సంస్థ పెంచింది! ఈ నేపథ్యంలో ధరల పెంపునకు సంబంధించిన వివరాలను ఇక్కడ తెలుసుకోండి..

మారుతి సుజుకి బ్రెజా ఎస్​యూవీ మునుపటి కంటే ఇప్పుడు ఖరీదైనది. దీని ఎక్స్​షోరూమ్ ధర రూ.8.69 లక్షల నుంచి ప్రారంభమవుతోంది. ఎల్ఎక్స్ఐ వేరియంట్ ధర రూ.15,000 పెరగ్గా.. వీఎక్స్ఐ, జెడ్ఎక్స్ఐ వేరియంట్ల ధరలు వరుసగా రూ.5,500, రూ.11,500 హైక్​ని చూశాయి. టాప్ ఎండ్ జెడ్ఎక్స్ఐ ప్లస్ వేరియంట్ల ధరలు మాత్రం సంస్థ పెంచలేదు.

మారుతీ సుజుకీ ఇండియా లిమిటెడ్ బ్రెజాలో కొన్ని భద్రతా ఫీచర్లను జోడించడంతో ధరలను పెంచింది. ఇప్పుడు బ్రెజాలో వచ్చిన అతిపెద్ద భద్రతా ఫీచర్ 6 ఎయిర్ బ్యాగులు! ఇది కాకుం...