భారతదేశం, మార్చి 1 -- Maruti Suzuki Alto K10: మారుతి సుజుకి ఆల్టో K10 ఇప్పుడు ప్రామాణికంగా 6 ఎయిర్‌బ్యాగ్‌లతో అందుబాటులో ఉంటుంది. ఆల్టో K10 ధర రూ. 4.23 లక్షల నుండి రూ. 6.21 లక్షల వరకు ఉంది. రెండు ధరలు ఎక్స్-షోరూమ్ ధరలు. ఆల్టో K10 లో మారుతి సుజుకీ ఎలాంటి యాంత్రిక లేదా సౌందర్యపరమైన మార్పులు చేయలేదు. 6 ఎయిర్‌బ్యాగ్‌లతో, ఆల్టో K10 ఇప్పుడు మరింత సురక్షితంగా మారింది. బడ్జెట్ ధరలో సురక్షితమైన కారు కావాలనుకునే వారికి ఆల్టో కే 10 ఇప్పుడు మంచి ఎంపిక అవుతుంది.

కొత్త మారుతి సుజుకి ఆల్టో K10 లో ఆరు ఎయిర్‌బ్యాగ్‌లతో పాటు, ఎలక్ట్రానిక్ స్టెబిలిటీ ప్రోగ్రామ్, రియర్ పార్కింగ్ సెన్సార్లు, యాంటీ-లాకింగ్ బ్రేకింగ్ సిస్టమ్, ఎలక్ట్రానిక్ బ్రేక్ డిస్ట్రిబ్యూషన్, త్రీ-పాయింట్ సీట్‌బెల్ట్‌ వంటి సెక్యూరిటీ ఫీచర్లు ఉన్నాయి.

మారుతి సుజుకి ఆల్టో K10 ఇంజిన్‌లో ఎలాంట...