భారతదేశం, మార్చి 10 -- నిరంతరం పెరుగుతున్న పెట్రోల్, డీజిల్ ధరలు, కఠినమైన ఉద్గార నిబంధనల కారణంగా ప్రజలు ఎలక్ట్రిక్, హైబ్రిడ్ కార్ల వైపు మొగ్గు చూపుతున్నారు. ఛార్జింగ్ మౌలిక సదుపాయాల గురించి ఆలోచించి.. కొందరు ఈవీలను కొనేందుకు సంకోచిస్తున్నారు. అటువంటి పరిస్థితిలో హైబ్రిడ్ కార్లు మంచి ఆప్షన్‌గా మారుతున్నాయి. దీన్ని దృష్టిలో ఉంచుకుని, దేశంలోని అతిపెద్ద కార్ల తయారీ సంస్థ త్వరలో హైబ్రిడ్ ఇంజిన్‌లతో అనేక కొత్త ఉత్పత్తులను ప్రవేశపెట్టనుంది.

గత నెలలో దేశంలో అత్యధికంగా అమ్ముడైన కారుగా నిలిచిన ఈ కారు త్వరలో కొత్త అవతారంలో వస్తుందని భావిస్తున్నారు. ఇటీవల టెస్టింగ్ సమయంలో కనిపించింది. ఈ సంవత్సరం చివరి నాటికి విడుదలయ్యే అవకాశం ఉంది. అంతర్గతంగా అభివృద్ధి చేసిన హైబ్రిడ్ పవర్‌ట్రెయిన్‌తో వస్తుంది. HEV సిరీస్‌తో కూడిన ఈ హైబ్రిడ్ ఇంజన్ లీటరుకు 35 కిలోమీటర...