భారతదేశం, ఏప్రిల్ 3 -- సీఎన్జీ కారు అనగానే దేశంలో మెుదటగా గుర్తుకువచ్చేది మారుతి. ఈ కంపెనీ పోర్ట్ ఫోలియోలో మొత్తం 17 మోడళ్లు ఉన్నాయి. ఇందులో 1 డజనుకు పైగా కార్లు సీఎన్జీతో కొనుగోలు చేసేందుకు అవకాశం ఉంది. మారుతి సీఎన్జీ కార్ల మైలేజ్ కూడా అత్యధికంగా ఉంది. ఈ కారణంగానే 2025 ఆర్థిక సంవత్సరంలో ఈ కార్లను కొనుగోలు చేసేందుకు దేశవ్యాప్తంగా కస్టమర్లు బారులు తీరారు. మారుతి సుజుకి 2025 ఆర్థిక సంవత్సరంలో దేశీయ మార్కెట్లో మొత్తం 1,795,259 ప్యాసింజర్ వాహనాలను విక్రయించింది. ఇందులో మారుతి సీఎన్జీ అమ్మకాలు 6.20 లక్షల యూనిట్లుగా ఉన్నాయి. అంటే గత ఏడాది విక్రయించిన ప్రతి మూడింటిలో ఒకటి సీఎన్జీ కారు. సీఎన్జీ వాహన విక్రయాల్లో కంపెనీ 28 శాతం వృద్ధిని సాధించింది.

మారుతి సుజుకి దేశంలో అతిపెద్ద సీఎన్జీ పోర్ట్‌ఫోలియోను కలిగి ఉంది. ఇందులో 13 వాహనాలు ఉన్నాయి. జిమ్నీ,...