Hyderabad, మార్చి 21 -- Director Maruthi About Buying Allu Arjun Arya Movie: టాలీవుడ్‌లో మంచి గుర్తింపు తెచ్చుకున్న దర్శకుల్లో మారుతి ఒకరు. ఈ రోజుల్లో సినిమాతో డైరెక్టర్‌గా డెబ్యూ ఎంట్రీ ఇచ్చిన మారుతి మొదటి మూవీతోనే సాలిడ్ హిట్ కొట్టారు. ఈ రోజుల్లో మూవీ విపరీతంగా యూత్‌ను అట్రాక్ట్ చేసింది.

ఆ తర్వాత చేసిన బస్ స్టాప్ సినిమాకు కూడా మంచి ప్రశంసలు వచ్చాయి. అనంతరం అల్లు శిరీష్‌తో తెరకెక్కించిన కొత్త జంట పర్వాలేదనిపించుకుంది. ఇక నేచురల్ స్టార్ నానితో భలే భలే మగాడివోయ్ మూవీతో సాలిడ్ హిట్ అందుకున్నారు మారుతి. ఇక మారుతి కథ అందించిన హారర్ కామెడీ మూవీ ప్రేమ కథా చిత్రమ్ సరికొత్త ట్రెండ్ క్రియేట్ చేసింది.

ఈ సినిమాతోనే తెలుగులో హారర్ కామెడీ జోనర్ ఊపందుకుంది. అలాంటి దర్శకుడు మారుతి ఇప్పుడు ఏకంగా పాన్ ఇండియా స్టార్ ప్రభాస్‌తోనే సినిమా చేస్తున్నారు. హారర...