భారతదేశం, జనవరి 29 -- గ్రహాలు ఎప్పటికప్పుడు తమ రాశులను మారుస్తూ ఉంటాయి. గ్రహాల సంచారంలో మార్పులు జరిగితే, అది అన్ని రాశుల వారిపై ప్రభావాన్ని చూపిస్తుంది. కుజుడు కూడా కాలనుగుణంగా తన రాశులను మారుస్తూ ఉంటాడు. అలాగే నక్షత్రాలను కూడా మారుస్తూ ఉంటాడు. కుజుడు ధైర్యం, నిర్ణయాలు తీసుకునే సామర్థ్యం మొదలైన వాటికి కారకుడు.

మార్చి 3న కుజుడు రాహువు నక్షత్రమైన శతభిష నక్షత్రంలోకి ప్రవేశిస్తాడు. ఇలా కుజుడు తన స్థానాన్ని మార్చుకోవడంతో శుభ ఫలితాలు ఎదురవుతాయి. హోలీ నాడు ఈ సంచారం చోటు చేసుకోబోతుండడంతో కొన్ని రాశుల వారికి బాగా కలిసి వస్తుంది.

మార్చి 3, హోలీ నాడు కుజుడు శతభిషా నక్షత్రంలోకి ప్రవేశించడంతో కొన్ని రాశుల వారు ఊహించని మార్పులను చూస్తారు. అనేక విధాలుగా ఈ రాశుల వారికి కలిసి రాబోతోంది. తెలివితేటలు, ధైర్యం పెరుగుతాయి. రిలేషన్‌షిప్‌లో కూడా బాగా కలిసి వస...