Hyderabad, ఫిబ్రవరి 2 -- పెళ్లి అనేది జీవితంలోని అత్యంత ముఖ్యమైన, పవిత్రమైన బంధం. ఇద్దరు వ్యక్తులు కలిసి జీవితాంతం సుఖంగా, సంతోషంగా ఉండటం దీని ఉద్దేశం. కానీ వివాహం అనేది కొందరిలో ఉత్సుకత, ఆనందాన్ని కలిగిస్తుంటే, మరికొందరిలో భయం, ఆందోళనకు దారితీస్తుంది. నిజానికి వివాహానికి కున్న ఉద్దేశాన్ని నెరవేర్చడానికి దంపతులు ఇద్దరి కృషి చేయాల్సి ఉంటుంది. దానికి కొంత అనురాగం, త్యాగం తప్పకుండా అవసరం.

వైవాహిక జీవితంలో కొన్నిసార్లు సమస్యలు రావచ్చు, ఇద్దరి మధ్య వివాదాలు తలెత్తవచ్చు. కారణం ఏదైనప్పటికీ ఒకసారి ఏర్పడిన ఈ చీలికను సరిచేయకపోతే అని మళ్లీ మళ్లీ సమస్యను లేవనెత్తుతుంది, పెద్దదిగా మారుతుంది. సుఖమైన దాంపత్యానికి అడ్డంకి అవుతుంది మరియు మానసిక శాంతి ఉండదు. అలా మారిందంటే విడిపోవాల్సిన పరిస్థితి దాపరిస్తుంది. సాధారణంగా వైవాహిక జీవితంలో చాలా మంది చేసే పొరప...