భారతదేశం, ఏప్రిల్ 19 -- Market Mahalakshmi Review: కేరింత ఫేమ్ పార్వతీశం, ప్రణీకాన్వికా జంట‌గా న‌టించిన మూవీ మార్కెట్ మ‌హాల‌క్ష్మి. వీఎస్ ముఖేష్ ద‌ర్శ‌క‌త్వం వ‌హించిన ఈ సినిమాకు అఖిలేష్ నిర్మించాడు. మెసేజ్ ఓరియెంటెడ్ ల‌వ్‌స్టోరీగా రూపొందిన ఈ మూవీ శుక్ర‌వారం థియేట‌ర్ల‌లో విడుద‌లైంది. ఈ సినిమా ఎలా ఉందంటే...

హీరో (సినిమాలో పార్వ‌తీశం క్యారెక్ట‌ర్ ఎక్క‌డ వినిపించ‌దు) సాఫ్ట్‌వేర్ కంపెనీలో జాబ్ చేస్తుంటాడు. పెళ్లి విష‌యంలో అత‌డికంటూ కొన్ని ఆలోచ‌న‌లు, అభిప్రాయాలు ఉంటాయి. ఎవ‌రిపై ఆధార‌ప‌డ‌కుండా ఇండిపెండెంట్‌గా బ‌తికే అమ్మాయి త‌న‌కు భార్య‌గా రావాల‌ని క‌ల‌లు కంటాడు. హీరో తండ్రి (కేదార్ శంక‌ర్‌) మాత్రం క‌ట్నం ఎక్కువ‌గా ఇచ్చే పిల్ల‌తోనే అత‌డి పెళ్లి జ‌రిపించే ప్ర‌య‌త్నాలు చేస్తున్నారు. ఏవేవో కార‌ణాలు చెప్పి తండ్రి తీసుకొచ్చిన సంబంధాలు రిజెక్ట్ చేస్త...