భారతదేశం, ఏప్రిల్ 12 -- Marine Fishing Ban : రాష్ట్రంలో మ‌త్స్యకారుల వేటపై ప్రభుత్వం నిషేధం విధించింది. ఏప్రిల్ 15 నుంచి జూన్ 14 వ‌ర‌కు వేట‌ను నిషేదిస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు విడుద‌ల చేసింది. మ‌రోవైపు పరిహారం కోసం మ‌త్స్యకారులు డిమాండ్ చేస్తున్నారు. మ‌త్స్య సంప‌ద అభివృద్ధికి ప్రభుత్వం వేట నిషేధం విధిస్తోంది. ఈ స‌మ‌యంలో మ‌ర‌బోట్లు, మెక‌నైజ్డ్ బోట్లు మోట‌రు బోట్లతో స‌ముద్రంలోకి వెళ్లడం నిషేధం. ఎవ‌రైనా ప్రభుత్వ ఉత్తర్వుల‌ను ఉల్లంఘిస్తే క‌ఠిన చ‌ర్యలు తీసుకుంటామ‌ని పేర్కొంది.

ఈ మేర‌కు రాష్ట్ర ప్రభుత్వ స్పెష‌ల్ చీఫ్ సెక్రట‌రీ బి.రాజ్‌శేఖర్ జీవో నెంబ‌ర్ 129ని విడుద‌ల చేశారు.కేంద్ర మత్స్య, పశుసంవర్ధక, పాడిపరిశ్రమ మంత్రిత్వ శాఖ ఆదేశాల మేర‌కు ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలిపారు. తూర్పు తీరంలోని ప్రాదేశిక జలాలకు ఆవల ఇండియన్ ఎక్స్‌క్లూజివ్ ఎకనామిక్ జోన...