భారతదేశం, డిసెంబర్ 3 -- తెలుగు మాసాల్లో విశిష్టమైనది మార్గశిర మాసం. అందుకే "మాసానాం మార్గశీర్షోహం" అని అంటారు. మార్గశిర మాసంలో వచ్చే గురువారాలను లక్ష్మీ వారాలు అని అంటారు. ఆ రోజుల్లో లక్ష్మీదేవిని పూజిస్తే సకల సంతోషాలు కలుగుతాయి. మార్గశిర మాసంలో వచ్చే నాలుగు గురువారాలు కూడా చాలా విశేషమైనవి. శ్రావణ మాసంలో ఎలా అయితే వరలక్ష్మీ వ్రతం చేస్తామో, ఈ మార్గశిర మాసంలో కూడా గురువారం నాడు లక్ష్మీదేవిని ఆరాధించాలి.

అలా చేయడం వలన లక్ష్మీదేవి ఇంట్లో ఉంటారని, ఆర్థిక ఇబ్బందులు ఉండవని నమ్ముతారు. లక్ష్మీదేవి ఇంట్లో ఉంటే ఆర్థికంగా బావుంటుంది, ఐశ్వర్యవంతులు అవ్వచ్చు. లక్ష్మీకటాక్షంతో ఆనందంగా ఉండొచ్చు. మానసిక ప్రశాంతత, ఆధ్యాత్మికత, పురోగతిని కూడా అమ్మవారు మనకు ప్రసాదిస్తారు.

రేపే మార్గశిర మాసంలో వచ్చే రెండవ గురువారం. ఈ గురువారం నాడు లక్ష్మీదేవిని భక్తిశ్రద్ధల...