భారతదేశం, నవంబర్ 21 -- ఈరోజు నుంచి మార్గశిర మాసం మొదలైంది. మార్గశిర మాసంలో లక్ష్మీదేవిని ఆరాధించడం వలన సకల శుభాలు కలుగుతాయి, లక్ష్మీ అనుగ్రహంతో డబ్బుకి కూడా లోటు ఉండదు. అయితే ఈసారి మార్గశిర మాసంలో ఎన్ని లక్ష్మి వారాలు వచ్చాయి, ఏ రోజు పెట్టిన నైవేద్యం పెట్టాలి, పూజా విధానంతో పాటు పూర్తి వివరాలను తెలుసుకుందాం.

నవంబర్ 21 అంటే ఈరోజు నుంచి మార్గశిర మాసం ప్రారంభమైంది. మార్గశిర మాసంలో వచ్చే గురువారాలను లక్ష్మీ వారాలని అంటారు. మార్గశిర మాసానికి ఉన్న విశిష్టత కూడా ఇంత అంతా కాదు. "మాసానం మార్గశీర్షోహం" అన్నారు. సాక్షాత్తు వరలక్ష్మి దేవిని మార్గశిర మాసంలో వచ్చే గురువారాల నాడు ఎవరైతే పూజిస్తారో వారికి వరాలను అందిస్తుంది, వారి కోరికలన్నీ తీరుతాయి. మార్గశిర మాసంలో ఎన్ని గురువారాలు వచ్చాయి, పూజా విధానం, నైవేద్యాలు, నియమాలు వంటి విషయాలను తెలుసుకుందాం. ...