భారతదేశం, మార్చి 30 -- Margadarsi Bangaru Kutumbam : పేదరిక నిర్మూలనలో భాగంగా 'మార్గదర్శి-బంగారు కుటుంబం' పేరుతో పీ4 కార్యక్రమానికి ఏపీ ప్రభుత్వం శ్రీకారం చుట్టింది. ముఖ్యమంత్రి చంద్రబాబు, డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ పీ-4(పబ్లిక్, ప్రైవేట్, పీపుల్, పార్టనర్ షిప్) కార్యక్రమాన్ని ప్రారంభించారు. సమాజంలో మార్పు తెచ్చేందుకే పీ-4 విధానం తీసుకొచ్చామని సీఎం చంద్రబాబు తెలిపారు. ఉగాది పండుగ రోజున ఏ కార్యక్రమం తలపెట్టినా విజయవంతం అవుతుందని, అందుకే ఈ వినూత్న కార్యక్రమానికి శ్రీకారం చుట్టామన్నారు.
పీ4 తొలి దశలో దాదాపు 20 లక్షల మందికి లబ్ధి చేకూరేలా ప్రణాళికలు రూపొందించినట్లు సీఎం చంద్రబాబు తెలిపారు. వెలగపూడి సచివాలయానికి సమీపంలో జరిగిన ఈ కార్యక్రమానికి పెద్ద ఎత్తున ప్రజలు తరలివచ్చారు. 'మార్గదర్శి- బంగారు కుటుంబం' నినాదంతో పీ-4 కార్యక్రమానికి మంగళగిరిక...
Click here to read full article from source
To read the full article or to get the complete feed from this publication, please
Contact Us.