భారతదేశం, ఏప్రిల్ 3 -- Maoists Letter: మావోయిస్టులపై సాయుధ బలగాలు విరుచుకు పడుతున్న వేళ శాంతి చర్చల కోసం సిద్ధమేనని మావోయిస్టులు ప్రకటించారు. ఈ మేరకు పార్టీ కేంద్ర కమిటీ అధికార ప్రతినిధి అభయ్ పేరున సంచలన లేఖ విడుదల చేసింది. విప్లవోద్యమ ప్రాంతాల్లో ఆదివాసీ యువతీ యువకులను సాయుధ బలగాల్లో చేర్చుకుని, వారితోనే ఆదివాసులను హత్యలు చేయిస్తున్నాయని లేఖలో పేర్కొంది.

అందుకే శాంతి చర్చల కోసం సానుకూల వాతావరణాన్ని ఏర్పాటు చేయాలని కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల ముందు ప్రతిపాదన పెట్టింది. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు తమ ప్రతిపాదనలపై సానుకూలంగా స్పందిస్తే తక్షణమే కాల్పుల విరమణ ప్రకటిస్తామని కూడా లేఖలో పేర్కొంది.

2024 జనవరిలో కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం, విప్లవోద్యమ ప్రభావిత రాష్ట్ర ప్రభుత్వాలు కలిసి 'కగార్' పేరుతో ప్రజలపై ప్రతిఘాతక యుద్ధాన్ని ప్రారంభించాయని ...