భారతదేశం, ఏప్రిల్ 14 -- Maoist Story : ఆవేశంలో అడవిబాట పట్టింది. భర్త అడుగుజాడల్లో నడిచింది. నక్సల్ బరి ఉద్యమం సాగించింది. ఓ బిడ్డకు తల్లైనప్పటికీ నమ్ముకున్న సిద్దాంతానికి కట్టుబడి కడుపున పుట్టిన బిడ్డను బంధువులకు అప్పగించి మావోయిస్ట్ గా 40 ఏళ్లు అజ్ఞాత జీవితం గడిపింది. ప్రతికూల పరిస్థితుల నేపద్యంలో అనారోగ్యం పాలై అడవిబాట వీడి జనజీవన స్రవంతిలో కలిసి స్వస్థలానికి చేరింది. కడుపున పుట్టిన బిడ్డను గుండెలకు అతుక్కుని కన్నీటి పర్యంతమయ్యారు. బంధుమిత్రులంతా భావోద్వేగానికి గురయ్యారు. ఈ అరుదైన సంఘటన జగిత్యాల జిల్లా కోరుట్లలో చోటుచేసుకుంది.

జగిత్యాల జిల్లా కోరుట్ల పట్టణానికి చెందిన దళిత వర్గానికి చెందిన పసుల రాంరెడ్డి నక్సల్ బరి ఉద్యమంతో 1971లో పీపుల్స్ వార్ లో చేరారు. కొంతకాలానికి అరెస్ట్ అయి జైల్ పాలయ్యారు. జైల్ నుంచి బెయిల్ పై బయటకు వచ్చిన రాంరె...