భారతదేశం, మార్చి 1 -- రాయలసీమలో వలసలు లేకుండా చూడాలన్నదే తమ లక్ష్యమని.. మంత్రి నారా లోకేష్ వ్యాఖ్యానించారు. కర్నూలు జిల్లా మంత్రాలయంలో మంత్రి పర్యటించారు. శ్రీ రాఘవేంద్ర స్వామి గురువైభవోత్సవాల్లో పాల్గొని స్వామివారిని దర్శించుకున్నారు. మార్చి 1వ తేదీ శనివారం నుంచి ఆరు రోజుల పాటు ఈ ఉత్సవాలు జరగనున్నాయి. 6వ తేదీ శ్రీ రాఘవేంద్ర స్వామి జన్మదిన వేడుకలు జరగనున్నాయి. ఈ ఉత్సవాల్లో భాగంగా తొలిరోజు నారా లోకేష్ ముఖ్య అతిథిగా హాజరయ్యారు.

శ్రీ రాఘవేంద్ర స్వామి పీఠాన్ని అధిష్టించిన పరమ పవిత్ర రోజును పురస్కరించుకుని.. మఠం పీఠాధిపతి సుబుదేంద్ర తీర్థుల వారి ఆధ్వర్యంలో నిర్వహించిన 404వ పాదుకా పట్టాభిషేక మహోత్సవంలో లోకేష్ పాల్గొన్నారు. స్వామి వారి ఆశీస్సులు పొందారు. ఈ సందర్భంగా లోకేష్ మాట్లాడుతూ.. కోరిన కోర్కెలు తీర్చే దేవుడు శ్రీ రాఘవేంద్రస్వామి అని చెప్ప...