Hyderabad, మే 14 -- Manoj Bajpayee About Mother Death: ది ఫ్యామిలీ మ్యాన్ వెబ్ సిరీస్ యాక్టర్, వెర్సటాలిటీ నటుడు మనోజ్ బాజ్‌పాయి ప్రస్తుతం వరుస సినిమాలు, వెబ్ సిరీసులతో బిజీగా ఉన్నారు. ఇటీవలే ఓటీటీ క్రైమ్ ఇన్వెస్టిగేటివ్ థ్రిల్లర్ మూవీ సైలెన్స్ 2తో (Silence 2 OTT) అలరించిన ఆయన భయ్యాజీ అనే మూవీ చేస్తున్నారు.

అపూర్వ సింగ్ కర్కి దర్శకత్వం వహిస్తున్న ఈ యాక్షన్ చిత్రం మే 24న థియేటర్లలో విడుదల కానుంది. ఇదే కాకుండా తనకు ఎంతో పేరు తీసుకొచ్చిన ది ఫ్యామిలీ మ్యాన్ వెబ్ సిరీస్ సీజన్ 3 (The Family Man 3 OTT) కూడా చేస్తున్నారు. ఈ సీజన్ 3ను ఈ ఏడాదిలో ఓటీటీ రిలీజ్ చేయనున్నారు. ఇదిలా ఉంటే తన తండ్రి రాధాకాంత్ బాజ్‌పాయ్‌ను తానే చనిపోమ్మని చెప్పినట్లు షాకింగ్ విషయం బయటపెట్టారు మనోజ్ బాజ్‌పాయ్.

"నా జీవితంలో అత్యంత విషాదకర సంఘటన మా నాన్న మరణం. ఒకరోజు నా సోదర...