Hyderabad, మే 24 -- Manjummel Boys vs Ilaiyaraaja: మలయాళ బ్లాక్ బస్టర్ మూవీ మంజుమ్మల్ బాయ్స్ లో తాను కంపోజ్ చేసిన పాటను తన అనుమతి లేకుండా వాడుకున్నారంటూ ఆ టీమ్ కు ఇళయరాజా లీగల్ నోటీసులు పంపిన సంగతి తెలుసు కదా. దీనిపై తాజాగా ఈ మూవీ ప్రొడ్యూసర్ కౌంటర్ ఇచ్చాడు. సదరు మ్యూజిక్ కంపెనీల నుంచి హక్కులు కొనుగోలు చేసిన తర్వాతే ఈ పాటను వాడుకున్నట్లు చెప్పాడు.

గుణ మూవీలోని సూపర్ హిట్ కమ్మనీ నీ ప్రేమ లేఖలే రాసింది హృదయమే పాటను మంజుమ్మల్ బాయ్స్ మూవీలో వాడారు. ముఖ్యంగా క్లైమ్యాక్స్ లో ఈ ప్రేమికుల పాటను స్నేహితుల మధ్య బంధాన్ని సూచించేలా వాడిన తీరు గూస్ బంప్స్ తెప్పించింది. మొత్తం సినిమా ఒకెత్తయితే.. క్లైమ్యాక్స్ లో ఈ పాట రావడం మరొక ఎత్తు. ఇదే సినిమాను బ్లాక్ బస్టర్ చేసింది.

అయితే ఈ పాటను తన అనుమతి లేకుండానే సినిమాలో వాడుకున్నారని ఈ సాంగ్ కంపోజ్ చేసిన ఇళ...