Hyderabad, మే 23 -- Manjummel Boys Climax: మంజుమ్మల్ బాయ్స్ మలయాళం ఇండస్ట్రీలో ఓ సెన్సేషన్. ఆ ఇండస్ట్రీలో అత్యధిక వసూళ్లు సాధించిన సినిమా ఇది. దీని గురించి ఎంత చెప్పుకున్నా తక్కువే. అయితే తాజాగా ఈ మూవీ గురించి మరో ఆసక్తికర విషయం బయటకు వచ్చింది. మూవీ క్లైమ్యాక్స్ లో సుభాష్ పాత్ర పోషించిన శ్రీనాథ్ భాసి మేకప్ కోసం ఓరియో బిస్కెట్లు వాడారట.

తమిళనాడులోని కొడైకెనాల్ లో ఉన్న గుణ కేవ్స్ లో ఓ కేరళ యువకుడు పడిపోవడం అనే నిజజీవిత ఘటన ఆధారంగా ఈ మంజుమ్మల్ బాయ్స్ తెరకెక్కిన విషయం తెలిసిందే. 2006లో ఈ ఘటన జరిగింది. ఇందులో ఆ గుహలో పడిపోయిన సుభాష్ అనే పాత్రలో నటుడు శ్రీనాథ్ భాసి కనిపించాడు. అతన్ని మూవీ క్లైమ్యాక్స్ లో నెత్తుటి మడుగులో ఉన్నట్లుగా చూపించారు.

అయితే ఇంతటి గాయాలు అయినట్లుగా చూపించడానికి మేకర్స్ వాడింది ఏంటో తెలుసా? ఓరియా బిస్కెట్లు అట. ఈ విషయాన...