Hyderabad, ఫిబ్రవరి 7 -- జీవితంలో కొందరి మాటలను నమ్మి మనం నష్టపోతుంటాం. మోసగాళ్ల వలలో పడి భారీ నష్టాలు కొని తెచ్చుకుంటాం. చివరికి రియలైజ్ అయి నష్టపోయామని లెంపలేసుకుంటాం. అప్పటికే పీకల్లోతు కష్టాల్లోకి కూరుకుపోతాం. ఇకపై అలా జరగకుండా ఉండాలంటే, ముందుగా మన చుట్టూ ఉన్న మోసగాళ్లెవరో గుర్తించాలి. వాళ్ల మాయలో పడి మోసపోకుండా మనల్ని మనం కాపాడుకోవాలి. ఈ మాయగాళ్లను వారి ప్రవర్తనను బట్టే సులువుగా తెలుసుకోవచ్చట. కపటవంతులు మిమ్మల్ని మూర్ఖులను చేసి తమకు లాభం చేర్చుకునే ప్రయత్నం చేస్తుంటారట. మనస్తత్వ శాస్త్రంలో కొన్ని శారీరక భాషా సంకేతాల ఆధారంగా వీరిని ఈజీగా ఐడెంటిఫై చేయొచ్చట. అదెలా అంటారా..? మోసం చేయాలనుకునే వారు ఎలా ప్రవర్తిస్తారో, వారిని ఎలా గుర్తించాలో తెలుసుకోండి.

కపటవంతులు లేదా మోసగాళ్లు తమ మాటలను మీరు నమ్మేలా చేస్తారు. నమ్మదగిన మాటలు చెప్పి లేని వ...