Hyderabad, మార్చి 18 -- పుల్లని మామిడికాయలు ఎంత రుచిగా ఉంటాయో వాటితో వండే వంటలు కూడా అదిరిపోతాయి. పుల్లని మామిడికాయ మటన్ కలిపి వండితే ఆ రుచే అద్భుతంగా ఉంటుంది. ఒక్క ముక్క కూడా మిగలదు. ఇగురు మొత్తం ఊడ్చేస్తారు. ఇక్కడ మేము పుల్లని మామిడికాయతో మటన్ కర్రీ ఎలా వండాలో చెప్పాము. రెసిపీ ఫాలో అయిపోండి.

పుల్లని మామిడికాయ - ఒకటి

మటన్ - అరకిలో

నూనె - అరకప్పు

అల్లం వెల్లుల్లి పేస్టు - రెండు స్పూన్లు

ఎండుమిర్చి - ఐదు

కారం - రెండు స్పూన్లు

గరం మసాలా - అరస్పూను

జీలకర్ర - ఒక స్పూను

ఉల్లిపాయలు - మూడు

ఉప్పు - రుచికి సరిపడా

కొత్తిమీర తరుగు - రెండు స్పూన్లు

1. మామిడికాయ మటన్ కర్రీని తయారు చేసేందుకు ముందుగా మామిడికాయను చెక్కు తీసి చిన్న ముక్కలుగా తరిగి పక్కన పెట్టుకోవాలి.

2. ఇప్పుడు స్టవ్ మీద కళాయి పెట్టి జీలకర్ర, ఎండుమిర్చి వేసి వేయించాలి. వాటిని...