భారతదేశం, మార్చి 10 -- Mangalagiri AIIMS Jobs : మంగ‌ళ‌గిరి ఎయిమ్స్‌లో 39 న‌ర్సింగ్ ఆఫీస‌ర్ పోస్టులు భ‌ర్తీ చేసేందుకు నోటిఫికేష‌న్ విడుద‌ల అయింది. ద‌ర‌ఖాస్తు దాఖ‌లు చేసేందుకు మార్చి 17న ఆఖ‌రు తేదీగా నిర్ణయించారు. ఆస‌క్తి, అర్హత ఉన్న అభ్యర్థులు వెంట‌నే ద‌ర‌ఖాస్తు చేసుకోవాల‌ని కోరుతుంది. ద‌ర‌ఖాస్తును ఆన్‌లైన్‌లో చేసుకోవాల్సి ఉంటుంది.

ఈ పోస్టుల‌కు సంబంధించిన నోటిఫికేష‌న్‌ను ఎయిమ్స్, న్యూదిల్లీ నోటిఫికేష‌న్ విడుద‌ల చేసింది. ఎయిమ్స్ మంగ‌ళ‌గిరితో పాటు దేశంలోని 18 ఎయిమ్స్‌కు, ఆరు హాస్పటిల్స్‌కు నోటిఫికేష‌న్ విడుద‌ల అయింది. మొత్తం 1,794 న‌ర్సింగ్ ఆఫీస‌ర్ పోస్టుల‌ను భ‌ర్తీ చేస్తున్నారు. ఈ పోస్టుల భ‌ర్తీకి న‌ర్సింగ్ ఆఫీసర్ రిక్రూట్‌మెంట్ కామన్ ఎలిజిబిలిటీ టెస్ట్ (ఎన్‌వోఆర్‌సీఈటీ)ని నిర్వహిస్తారు.

మంగ‌ళగిరి ఎయిమ్స్‌లో మొత్తం 39 పోస్టులను భ‌ర్తీ చేస...