భారతదేశం, మార్చి 14 -- చరిత్రలో ఎన్నడూ లేనివిధంగా మంగళగిరిలో తనకు మెజార్టీ ఇచ్చారని మంత్రి నారా లోకేష్ వ్యాఖ్యానించారు. మంగళగిరి నియోజవర్గంలో భారీ మెజార్టీతో గెలిపించాలని ఎన్నికల సమయంలో కోరానని.. అప్పుడే అభివృద్ధికి అవకాశం ఉంటుందని చెప్పిన విషయాన్ని గుర్తు చేశారు. రాష్ట్ర స్థాయిలో మూడో అత్యధిక మెజార్టీ సాధించానని.. ప్రజలు తనను దీవించారని అన్నారు. ప్రజలకు రుణపడి ఉంటానని.. మంగళగిరి నియోజకవర్గంలో అనేక అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాలను కూటమి ప్రభుత్వం ప్రారంభించామని చెప్పారు.

'ప్రభుత్వ, కొండ పోరంబోకు, చెరువు, రైల్వే భూముల్లో దశాబ్దాలుగా నివాసం ఉంటున్న వారు.. ఇంటిపట్టాల కోసం దశాబ్దాలుగా ఎదురుచూస్తున్నారు. గురువారం మొదటి పట్టా ఇప్పటంలో జనరేట్ అయింది. మొదటి విడతలో సుమారుగా 5 వేల మందికి ఉగాది తర్వాత ఇళ్ల పట్టాలు అందించాలని లక్ష్యంగా పెట్టుకుని పన...