భారతదేశం, జనవరి 12 -- Manda Jagannadham : నాగర్‌ కర్నూల్‌ మాజీ ఎంపీ మందా జగన్నాథం ఆదివారం అనారోగ్యంతో కన్నుమూశారు. గత కొన్ని రోజులుగా హైదరాబాద్‌ లోని నిమ్స్‌లో చికిత్స పొందుతున్న ఆయన..ఇవాళ సాయంత్రం తుదిశ్వాస విడిచారు. నాగర్‌ కర్నూల్‌ జిల్లా ఇటిక్యాలలో 1951 మే 22న జన్మించిన మందా జగన్నాథం.. నాలుగుసార్లు ఎంపీగా గెలిచారు. జగన్నాథం 1996, 1999, 2004, 2009లో ఎంపీగా ఎన్నికయ్యారు. 3 సార్లు టీడీపీ, ఒకసారి కాంగ్రెస్‌ తరఫున ఎంపీగా గెలిచారు. ఇటీవల లోక్‌సభ ఎన్నికలకు ముందు ఆయన బీఎస్పీలో చేరారు.

నాగర్‌ కర్నూల్ లోక్‌సభ మాజీ సభ్యుడు మందా జగన్నాథం మృతి పట్ల ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి తీవ్ర సంతాపం వ్యక్తం చేశారు. లోక్‌సభ సభ్యుడిగా, సామాజిక, తెలంగాణ ఉద్యమకారుడిగా జగన్నాథం పోషించిన పాత్ర మరువలేనిదని పేర్కొన్నారు. వారి మరణం తెలంగాణకు తీరని లోటు అని అన్నారు. జగన...