భారతదేశం, ఫిబ్రవరి 15 -- పాన్ ఇండియా రెబల్ స్టార్ ప్రభాస్ వరుస సినిమాలతో ఫుల్ బిజీగా ఉన్నారు. ప్రస్తుతం మారుతీ దర్శకత్వంలో 'ది రాజాసాబ్'తో పాటు డైరెక్టర్ హను రాఘవపూడితో ఓ మూవీ చేస్తున్నారు. అయితే, సందీప్ రెడ్డి వంగాతో ప్రభాస్ చేయనున్న స్పిరిట్ చిత్రానికి క్రేజ్ మరో రేంజ్‍లో ఉంది. షూటింగ్ మొదలుకాక ముందే ఈ చిత్రంపై హైప్ తారస్థాయికి చేరింది. స్పిరిట్ చిత్రంలో తాను భాగం కావాలని హీరో మంచు విష్ణు అనుకుంటున్నారు. ఆ వివరాలు ఇక్కడ చూడండి.

స్పిరిట్ సినిమాలో చేసేందుకు నటీనటులు కావాలంటూ సందీప్ రెడ్డి వంగా ఇటీవల సోషల్ మీడియాలో ప్రకటించారు. ఈ మూవీలో నటించాలనుకునే వారు వీడియో రికార్డ్ చేసి ఈమెయిల్‍కు పంపాలంటూ ఓ క్యాస్టింగ్ కాల్ ప్రకటించారు. దీనికి మంచు విష్ణు రియాక్ట్ అయ్యారు.

స్పిరిట్‍లో పాత్ర కోసం తాను అప్లై చేసుకున్నానని, ఏం జరుగుతుందో వేచిచూడాలని ...