Hyderabad, జనవరి 26 -- Manchu Vishnu Announces 50 Percent Scholarship To Army Children: మోహన్ బాబు విశ్వవిద్యాలయం ప్రో-ఛాన్సలర్ విష్ణు మంచు గణతంత్ర దినోత్సవం సందర్భంగా సాయుధ బలగాల త్యాగాలను గౌరవించే లక్ష్యంతో ఒక ముఖ్యమైన కార్యక్రమాన్ని చేపట్టినట్టుగా ప్రకటించారు.

త్రివిధ దళాలలో పని చేస్తున్న తెలుగు వారిని గౌరవించుకునేందుకు, వారి పిల్లలకు 50% స్కాలర్‌షిప్‌ను అందించబోతున్నట్టుగా విష్ణు మంచు ప్రకటించారు. ఈ కార్యక్రమం ఆంధ్రప్రదేశ్, తెలంగాణలకు మాత్రమే పరిమితం కాకుండా భారతదేశంలోని అన్ని తెలుగు కుటుంబాలకు వర్తించనుంది. మోహన్ బాబు విశ్వవిద్యాలయంలో అందించే అన్ని కోర్సులకు ఈ స్కాలర్‌షిప్‌లను అందించనున్నారు.

ఈ మేరకు మంచు విష్ణు మాట్లాడుతూ.. "మన దేశాన్ని రక్షించడానికి సైనికులు ఎన్నో త్యాగాలు చేస్తారు. వారి సేవలకు గౌరవ సూచికంగా, వారికి కృతజ్ఞతలు తెల...