భారతదేశం, ఏప్రిల్ 13 -- మంచు కుటుంబంలో కొంతకాలంగా తగాదాలు విపరీతంగా సాగుతున్నాయి. గొడవలు రచ్చకెక్కాయి. పోలీస్ స్టేషన్ల వరకు వెళ్లింది. మంచు మోహన్ బాబు, మంచు విష్ణుతో మంచు మనోజ్ వివాదం కొనసాగుతోంది. ఇటీవలే తండ్రి మోహన్‍ బాబు ఇంటి ఎదుట బైటాయించారు మనోజ్. ఈ క్రమంలో తాజాగా ఓ ఈవెంట్‍లో అక్క మంచు లక్ష్మిని కలిశారు మనోజ్.

మంచు లక్ష్మికి చెందిన టీచ్ ఫర్ ఛేంజ్ సంస్థ ఓ ఫండ్ రైజింగ్ కార్యక్రమం నిర్వహించింది. ఈ కార్యక్రమానికి మంచు మనోజ్ వచ్చారు. స్టేజ్ వెనుక నుంచి వచ్చి మంచు లక్ష్మిని తట్టి సర్‌ప్రైజ్ ఇచ్చారు మనోజ్. వెనక్కి తిరిగి తమ్ముడు మనోజ్‍ను చూసిన వెంటనే ఎమోషనల్ అయ్యారు లక్ష్మి. కన్నీరు పెట్టుకున్నారు.

మనోజ్ ముందు కూర్చొని భావోద్వేగంతో ఏడ్చేశారు లక్ష్మి. ఆమెను మనోజ్, అతడి భార్య మోనిక ఆమెను ఓదార్చారు. కుటుంబంలో జరుగుతున్న వివాదాల నేపథ్యంలో మనో...