Hyderabad, ఫిబ్రవరి 15 -- Manchu Manoj About Movies In Jagannath Teaser Launch: భ‌ర‌త్ ఫిలిం ఫ్యాక్ట‌రీ బ్యాన‌ర్‌పై భర‌త్‌, పీలం పురుషోత్తం నిర్మాణంలో తెర‌కెక్కుతున్న మూవీ 'జగన్నాథ్'. ఈ సినిమాకు సంతోష్ దర్శకత్వం వహించారు. జగన్నాథ్ సినిమాలో రాయ‌ల‌సీమ‌ భరత్, ప్రీతి జంటగా హీరో హీరోయిన్స్‌గా నటిస్తున్నారు.

తాజాగా జగన్నాథ్ మూవీ టీజర్‌ను, పోస్ట‌ర్‌ను ముఖ్య అతిథిగా పాల్గొన్న‌ రాక్‌స్టార్ మంచు మనోజ్‌ రిలీజ్‌ చేశారు. అన్నమయ్య జిల్లాలోని రాయచోటిలో ఘ‌నంగా జ‌రిగిన‌ 'జగన్నాథ్' మూవీ టీజర్‌ లాంచ్ వేడుక‌లో జ‌బ‌ర్ద‌స్త్ కామెడియ‌న్స్ అప్ప‌రావు, వినోదిని, గ‌డ్డం న‌వీన్ పాల్గొని వినోదం పంచారు. అనంతరం ఏర్పాటు చేసిన ఈవెంట్‌లో మంచు మనోజ్ ఇంట్రెస్టింగ్ కామెంట్స్ చేశాడు.

ఈ సంద‌ర్భంగా మంచు మనోజ్ మాట్లాడుతూ.. "జగన్నాథ్ మూవీ టీజ‌ర్ చాలా అద్భుతంగా ఉంది. త‌మ్ముడు 'ర...