Hyderabad,jalpally, ఏప్రిల్ 9 -- నటుడు మోహన్‌బాబు కుటుంబ వివాదం మరోసారి తెరపైకి వచ్చింది. ఆయన కుమారుడు మంచు మనోజ్ ఇవాళ. జల్‌పల్లిలోని మోహన్ బాబు ఇంటి వద్దకు చేరుకున్నారు. ఇంట్లోకి వెెళ్లేందుకు ప్రయత్నించారు. అయితే గేటు తెరవకపోవటంతో. అక్కడే బైఠాయించారు. మరోవైపు మనోజ్ రాకతో.పోలీసులు అలర్ట్ అయ్యారు. ఇంటి పరిసర ప్రాంతాల్లో ఎలాంటి ఉద్రిక్త పరిస్థితులు చోటుచేసుకోకుండా కట్టుదిట్టమైన భద్రతా ఏర్పాట్లు చేశారు.

గత కొంతకాలంగా మంచు కుటుంబంలో వివాదం కొనసాగుతోంది. విష్ణు, మనోజ్ మధ్య ఆస్తుల విషయంలో విభేదాలు తలెత్తాయి. ఈ క్రమంలోనే ఒకరిపై ఒకరు పలు విమర్శలు, ఆరోపణలు కూడా చేస్తున్నారు. ఈ క్రమంలోనే. మంగళవారం నార్సింగి పోలీసులకు మనోజ్ ఫిర్యాదు చేశాడు. తన కారు పోయిందని ఫిర్యాదులో పేర్కొన్నారు.

పాప పుట్టినరోజు వేడుకల కోసం మనోజ్‌ రాజస్థాన్ వెళ్లడాన్ని అవకాశంగా ...