భారతదేశం, ఫిబ్రవరి 8 -- రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక.. విప్లవాత్మకమైన నిర్ణయం తీసుకుంది. పౌరులు ఆఫీసుల చుట్టూ తిరిగే తిప్పలు తప్పించింది. ప్రజలు 161 సేవలను పొందేందుకు వీలుగా వాట్సప్‌ గవర్నెన్స్‌కు శ్రీకారంచుట్టింది. దీంతో పౌరులు తమకు అవసరమైన సేవలను వాట్సప్ ద్వారానే పొందుతున్నారు. ఇటీవల ప్రభుత్వం ప్రారంభించిన మన మిత్ర వాట్సప్‌ గవర్నెన్స్‌కు ఆదరణ పెరుగుతుంది.

2025 జనవరి 30న కూటమి ప్రభుత్వం మన మిత్ర పేరుతో వాట్సప్‌ గవర్నెన్స్‌ను అందుబాటులోకి తీసుకొచ్చింది. ఇందుకోసం 95523 00009 నంబరును కేటాయించింది. ఈ నంబరుకు హాయ్‌ అని మెసేజ్‌ చేస్తే.. ఏయే సేవలు అందుబాటులో ఉన్నాయో కనిపిస్తుంది. వాటిల్లో మనకు అవసరమైన సర్వీసును ఎంచుకొని.. సేవలను పొందవచ్చు.

పౌరులు ఏవైనా సర్టిఫికెట్లు పోగొట్టుకుంటే ఇన్నాళ్లు పోలీస్‌ స్టేషన్ల చుట్టూ తిరగాల్సి వచ...