భారతదేశం, ఏప్రిల్ 5 -- నోయిడాలో అత్యంత దారుణ ఘటన వెలుగులోకి వచ్చింది. అనుమానం అనే భూతంతో అంధుడైన ఓ వ్యక్తి.. తన భార్యను అతి కిరాతకంగా హత్య చేశాడు. సుత్తితో కొట్టి, కొట్టి చంపేశాడు. అనంతరం పోలీసుల ముందు లొంగిపోయాడు.

నోయిడాలోని సెక్టర్​ 15 ప్రాంతంలో శుక్రవారం మధ్యాహ్నం ఈ ఘటన వెలుగులోకి వచ్చింది. నిందితుడి పేరు నూర్​ ఉల్​ లాహ్​ హైదర్​. అతని వయస్సు 55ఏళ్లు. కంప్యూటర్​ ఇంజినీర్​ గ్యాడ్యుయేట్​ అతను. అతని భార్య పేరు ఆస్మా ఖాన్​ (42). ఒక ప్రైవేట్​ కంపెనీలో సివిల్​ ఇంజినీర్​గా పనిచేస్తోంది. వారికి ఇద్దరు పిల్లలు ఉన్నారు. ఒకరు బీటెక్​ స్టూడెంట్ సమద్​​. ఇంకొకరు 12ఏళ్ల ఇనాయా.

కాగా తన భార్యకు వివాహేతర సంబంధం ఉందని నూర్​కి చాలా కాలంగా అనుమానాలు ఉన్నాయి. ఈ విషయంపై ఇద్దరి మధ్య తరచూ గొడవ జరిగేదని తెలుస్తోంది. కుటుంబసభ్యుల సమాచారం ప్రకారం గురువారం ఈ గొడవ...