భారతదేశం, జనవరి 31 -- Mamta Kulkarni: బాలీవుడ్ మాజీ నటి మమతా కులకర్ణిని అఖాడా నుంచి బహిష్కరిస్తున్నట్లు కిన్నార్ అఖాడా వ్యవస్థాపకుడు రిషి అజయ్ దాస్ శుక్రవారం విడుదల చేసిన పత్రికా ప్రకటనలో ప్రకటించారు. తన అనుమతి లేకుండా మమతా కులకర్ణిని అఖాడాలో చేర్చుకున్న మహామండలేశ్వర్ లక్ష్మీనారాయణ్ త్రిపాఠిని కూడా కిన్నార్ అఖాడా నుంచి బహిష్కరిస్తున్నానని స్పష్టం చేశారు. తమకు తెలియకుండా మమతా కులకర్ణిని మహామండలేశ్వర్ గా లక్ష్మీనారాయణ్ త్రిపాఠి నియమించారని తెలిపారు.

మహామండలేశ్వర్ లక్ష్మీనారాయణ్ త్రిపాఠిని తన బాధ్యతల నుంచి తప్పించానని, మత ప్రచారం, మత ఆచారాలు, కిన్నర్ కమ్యూనిటీ అభ్యున్నతి తదితరాల కోసం ఆయనను నియమించిన పదవి నుంచి ఆయన తప్పుకున్నారని రిషి అజయ్ దాస్ ఆ ప్రకటనలో పేర్కొన్నారు. అఖాడాలోని మహామండలేశ్వర్ త్రిపాఠి, ఇతరులు నిబంధనలకు విరుద్ధమైన చర్యలకు పాల...