భారతదేశం, మార్చి 11 -- Malhar certificate: మహారాష్ట్రలోని హిందూ మాంసం వ్యాపారులకు ప్రత్యేక గుర్తింపును ఇచ్చేలా 'మల్హర్ సర్టిఫికేషన్'ను మహారాష్ట్ర ప్రభుత్వం ప్రవేశపెట్టింది. ''ఇది 100 శాతం హిందూ సమాజం నడుపుతున్న సరైన మటన్ దుకాణాలను గుర్తించడానికి, కల్తీ లేకుండా చూడటానికి సహాయపడుతుంది'' అని ఈ సందర్భంగా మత్స్య, ఓడరేవు అభివృద్ధి శాఖ మంత్రి నితీశ్ రాణే అన్నారు. ''మహారాష్ట్రలోని హిందూ సమాజం కోసం ఈ రోజు మేము చాలా ముఖ్యమైన అడుగు వేశాం. ఈ సందర్భంగా Malharcertfication.com లాంచ్ చేశాం' అని రాణే ఎక్స్ (గతంలో ట్విట్టర్)లో రాశారు. ఈ కార్యక్రమం వల్ల సమాజంలోని హిందు యువత ఆర్థికంగా బలోపేతం అవుతారన్నారు.

మల్హర్ సర్టిఫికేషన్ 100% హిందువులు నడుపుతున్న మటన్ షాపులకు మాత్రమే ఇస్తామని ప్రభుత్వం తెలిపింది. ''ఇక్కడ యాజమాన్యం, వర్కర్లు 100 శాతం హిందువులే ఉంటారు. అ...