భారతదేశం, ఫిబ్రవరి 7 -- ప్రస్తుత మారుతున్న జీవనశైలి మన ఆరోగ్యంపై చూపుతున్న ప్రభావం స్పష్టంగా తెలుస్తూనే ఉంది. ఒత్తిడితో కూడిన పని, బిజీ లైఫ్‌స్టైల్ కారణంగా చాలా మంది తమ ఆరోగ్యంపై సరైన శ్రద్ధ చూపరు. ఇప్పుడు ఆహారపు అలవాట్లలో భారీగా మార్పు వస్తోంది. ఈ పేలవమైన ఆహారపు అలవాట్ల ప్రభావం మొత్తం ఆరోగ్యం, ముఖ్యంగా సంతానోత్పత్తిపై ప్రతికూల ప్రభావాన్ని చూపుతుంది. చిన్న వయసులోనే వీర్యకణాల సంఖ్య తగ్గుతున్నట్లుగా చాలా మంది చెబుతున్నారు. ఇది అనేక ఆరోగ్య సమస్యల వల్ల వచ్చినప్పటికీ, ఆహారం కూడా ప్రధాన పాత్ర పోషిస్తుంది. పురుషుడి స్పెర్మ్ కౌంట్ తగ్గితే.. అది బిడ్డను కనడంలో సమస్యలను తెస్తుంది.

స్పెర్మ్ కౌంట్ తక్కువగా ఉండటానికి వివిధ కారణాలు ఉన్నాయి. వీటిలో ధూమపానం, మద్యపానం, మాదకద్రవ్యాల వ్యసనం, ఊబకాయం, మానసిక ఆరోగ్య సమస్యలు ఉన్నాయి. దీనితో పాటు ఆహారం కూడా పుర...