భారతదేశం, ఏప్రిల్ 23 -- Malaysia navy helicopters crash: మలేషియాకు చెందిన రెండు సైనిక హెలికాప్టర్లు మంగళవారం ట్రైనింగ్ సెషన్ లో ఢీకొని కూలిపోవడంతో అందులోని 10 మంది సిబ్బంది మృతి చెందారు. మే నెలలో జరిగే నేవీ ఫ్లీట్ ఓపెన్ డే వేడుకల కోసం మంగళవారం ఉదయం నేవీ హెలీకాప్టర్లు రిహార్సల్స్ చేస్తుండగా రెండు హెలికాప్టర్లు ఢీ కొని కుప్పకూలాయి. ఈ ప్రమాదంలో విమానంలో ఉన్న 10 మంది చనిపోయారు. మలేసియాలో మే నెలలో నేవీ ఫ్లీట్ ఓపెన్ డే వేడుకలు జరుగుతాయి. ఆ వేడుకల్లో విన్యాసాలు చేయడం కోసం నేవీ హెలీకాప్టర్లు (navy helicopters) లుముత్ నావికా స్టేడియంపై చక్కర్లు కొడుతున్న దృశ్యాలు సోషల్ మీడియాలో పెద్ద ఎత్తున షేర్ అయ్యాయి.

నేవీ ఫ్లీట్ ఓపెన్ డే వేడుకల్లో భాగంగా నేవీ చాపర్లు ఫ్లై పాస్ట్ విన్యాసాలు చేస్తాయి. ఆ విన్యాసాలకు సంబంధించి మంగళవారం ఉదయం నేవీ హెలీకాప్టర్లు రిహ...