Hyderabad, ఏప్రిల్ 4 -- Malayalam Thriller: మలయాళం థ్రిల్లర్ సినిమాలకు తెలుగు ఆడియెన్స్ లో స్పెషల్ క్రేజ్ ఉంది. థ్రిల్లర్, క్రైమ్ థ్రిల్లర్, మర్డర్ మిస్టరీ థ్రిల్లర్ సినిమాలను చివరి వరకు ఎంతో ఉత్కంఠ రేపేలా తీయడంలో అక్కడి డైరెక్టర్లు ఆరితేరిపోయారు. అలాంటిదే ఓ బ్లాక్‌బస్టర్ మర్డర్ మిస్టరీ మూవీ మిడ్‌నైట్ మర్డర్స్. మలయాళంలో అంజామ్ పతీరా టైటిల్ తో వచ్చింది.

అంజామ్ పతీరా అనే మలయాళం మర్డర్ మిస్టరీ మూవీ తెలుగులో మిడ్‌నైట్ మర్డర్స్ పేరుతో ఆహా వీడియో ఓటీటీలో ఉంది. అయితే ఇప్పుడీ మూవీని యూట్యూబ్ లోనూ ఫ్రీగా చూసే వీలుండటం విశేషం. ప్రముఖ మలయాళ నటుడు కుంచకో బొబన్ నటించిన ఈ మూవీ.. 2020లో థియేటర్లలో రిలీజైంది.

ఆ ఇండస్ట్రీ నుంచి వచ్చిన బెస్ట్ మర్డర్ మిస్టరీ సినిమాల్లో దీనినీ ఒకటిగా చెప్పొచ్చు. ఐఎండీబీలో 7.9 రేటింగ్ నమోదైంది. ఓ సీరియల్ కిల్లర్ చుట్టూ తిరి...