Hyderabad, ఏప్రిల్ 15 -- Malayalam Thriller: మర్డర్ మిస్టరీ థ్రిల్లర్ మూవీస్ తీయడంలో మలయాళం ఫిల్మ్ మేకర్స్ అందరి కంటే ఎంతో ముందే ఉంటారు. తెలుగులో వచ్చిన దృశ్యం మూవీ చూసే ఉంటారు కదా. అందులోని ట్విస్టులు మంచి థ్రిల్ పంచుతాయి. అలాంటిదే మరో మలయాళం మర్డర్ మిస్టరీ థ్రిల్లర్ మూవీ యూట్యూబ్ లో ఫ్రీగా అందుబాటులో ఉంది.

జియోహాట్‌స్టార్ ఓటీటీతోపాటు యూట్యూబ్ లోనూ ఫ్రీగా అందుబాటులో ఉన్న మలయాళం మర్డర్ మిస్టరీ థ్రిల్లర్ మూవీ హెవెన్ (Heaven). స్టార్ నటుడు సూరజ్ వెంజరమూడు లీడ్ రోల్లో నటించిన సినిమా ఇది. 2022లో రిలీజైంది. ఉన్ని గోవింద్‌రాజ్ సినిమాను డైరెక్ట్ చేశాడు. అతనికిది తొలి మూవీ అయినా.. సూపర్ థ్రిల్లర్ అందించాడు.

ఈ సినిమా కొన్ని హత్యల చుట్టూ తిరిగే స్టోరీ. ఐఎండీబీలో 6.5 రేటింగ్ నమోదైంది. థియేటర్లలో రిలీజైనప్పుడే పాజిటివ్ రివ్యూలు సొంతం చేసుకుంది. తర్...