భారతదేశం, ఫిబ్రవరి 22 -- Malayalam OTT: మ‌ల‌యాళం మూవీ ఫిబ్ర‌వ‌రి 14 సైలెంట్‌గా ఓటీటీలోకి వ‌చ్చింది. శ‌నివారం నుంచి అమెజాన్ ప్రైమ్ ఓటీటీలో ఈ మూవీ స్ట్రీమింగ్ అవుతోంది. 2023 అక్టోబ‌ర్‌లో ఫిబ్ర‌వ‌రి 14 మూవీ థియేట‌ర్ల‌లో రిలీజైంది. దాదాపు ఏడాదిన్న‌ర త‌ర్వాత ఓటీటీలోకి వ‌చ్చింది. ఫ్రీ స్ట్రీమింగ్ కాకుండా రెంట‌ల్ విధానంలో ఈ మూవీ ఓటీటీ ప్రేక్ష‌కుల ముందుకు రావ‌డం గ‌మ‌నార్హం.

ఈ రొమాంటిక్ ల‌వ్ డ్రామా మూవీలో హ‌రిత్‌, ఐశ్వ‌ర్య నంబియార్‌, నందు, మేఘ‌నాథ‌న్‌ కీల‌క పాత్ర‌లు పోషించారు. విజ‌య్ చంద‌త్ ద‌ర్శ‌క‌త్వం వ‌హించాడు. ఫిబ్ర‌వ‌రి 14 టైటిల్‌తో పాటు టీజ‌ర్‌, ట్రైల‌ర్‌తో మ‌ల‌యాళం ఆడియెన్స్‌ను ఆక‌ట్టుకున్న‌ది. కాన్సెప్ట్ బాగున్నా నాయ‌కానాయిక‌ల కెమిస్ట్రీ స‌రిగ్గా కుద‌ర‌క‌పోవ‌డంతో యావ‌రేజ్‌గా నిలిచింది. ఐఎమ్‌డీబీలో మాత్రం ఈ మూవీ 9.6 రేటింగ్‌ను ద‌క్కించుకోవ...