భారతదేశం, మార్చి 25 -- Malayalam OTT: మ‌ల‌యాళం రొమాంటిక్ కామెడీ మూవీ అన్పోడు క‌న్మ‌ణి సైలెంట్‌గా ఓటీటీలోకి వ‌చ్చింది. మంగ‌ళ‌వారం అమెజాన్ ప్రైమ్ ఓటీటీలో ఈ మూవీ రిలీజైంది. అన్పోడు క‌న్మ‌ణి మూవీలో అర్జున్ అశోక‌న్‌, అన‌ఘా నారాయ‌ణ‌న్ హీరోహీరోయిన్లుగా న‌టించారు. అల్తాఫ్ ఆస్లామ్‌, మాలా పార్వ‌తి కీల‌క పాత్ర‌లు పోషించారు.లిజు తోమ‌జ్ ద‌ర్శ‌క‌త్వం వ‌హించిన ఈ సినిమాకు సామ్యూల్ అబే మ్యూజిక్ అందించాడు.

ఈ ఏడాది జ‌న‌వ‌రిలో థియేట‌ర్ల‌లో రిలీజైన అన్పోడు క‌న్మ‌ణి హిట్టు టాక్‌ను తెచ్చుకున్న‌ది. సామాజిక క‌ట్టుబాట్ల‌కు, త‌మ స్వేచ్ఛ స్వాత త్య్రాల‌కు మ‌ధ్య న‌లిగిపోతూ ఓ జంట ఎలాంటి సంఘ‌ర్ష‌ణ‌ను ఎదుర్కొంది అన్న‌ది ఫ‌న్నీగా ద‌ర్శ‌కుడు ఈ మూవీలో చూపించారు. బాడీ షేమింగ్‌, సంతాన లేమి వంటి స‌మ‌స్య‌ల‌ను గురించి ద‌ర్శ‌కుడు ఈ మూవీలో చ‌ర్చించారు. మంచి మెసేజ్ ఓరియెంటెడ్ మూవీ...