భారతదేశం, ఫిబ్రవరి 16 -- Malayalam OTT: మ‌ల‌యాళం బ్లాక్‌బ‌స్ట‌ర్ మూవీ మార్కో తెలుగులో మ‌రో ఓటీటీలోకి రానుంది. ఉన్ని ముకుంద‌న్ హీరోగా న‌టించిన ఈ యాక్షన్ థ్రిల్ల‌ర్ మూవీ ఫిబ్ర‌వ‌రి 21 నుంచి ఆహా ఓటీటీలో స్ట్రీమింగ్ కానుంది. ఈ విష‌యాన్ని ఆహా ఓటీటీ అఫీషియ‌ల్‌గా ప్ర‌క‌టించింది. ఓ పోస్ట‌ర్‌ను అభిమానుల‌తో పంచుకున్న‌ది.

ఇటీవ‌లే మార్కో మూవీ సోనీలివ్ ఓటీటీలో రిలీజైంది. తెలుగు, మ‌ల‌యాళంతో పాటు మ‌రో మూడు భాష‌ల్లో స్ట్రీమింగ్ అవుతోంది. ఆహా ఓటీటీలో మాత్రం కేవ‌లం తెలుగు వెర్ష‌న్‌ను మాత్ర‌మే చూడొచ్చు.

మార్కో మూవీకి హ‌నీఫ్ అదేని ద‌ర్శ‌క‌త్వం వ‌హించాడు. డిసెంబ‌ర్ 20న థియేట‌ర్ల‌లో రిలీజైన ఈ మూవీ బిగ్గెస్ట్ బ్లాక్‌బ‌స్ట‌ర్‌గా నిలిచింది. 30 కోట్ల బ‌డ్జెట్‌తో రూపొందిన ఈ మూవీ 115 కోట్ల వ‌సూళ్ల‌ను రాబ‌ట్టింది. గ‌త ఏడాది మ‌ల‌యాళంలో హ‌య్యెస్ట్ క‌లెక్ష‌న్స్ రాబ‌ట్...