భారతదేశం, ఏప్రిల్ 9 -- మ‌ల‌యాళం అవార్డ్ విన్నింగ్ మూవీ నీల‌ముడి ఓటీటీలో రిలీజైంది. అమెజాన్ ప్రైమ్ వీడియోలో ఈ మూవీ స్ట్రీమింగ్ అవుతోంది. ఈ అవార్డ్ విన్నింగ్ మూవీ అమెజాన్ ప్రైమ్‌తో పాటు మ‌నోర‌మా మ్యాక్స్ ఓటీటీలో విడుద‌లైంది. కుల వ‌ర్ణ వివ‌క్ష‌పై సెటైరిక‌ల్ కామెడీగా నీల‌ముడి సినిమాను ద‌ర్శ‌కుడు శ‌ర‌త్‌కుమార్ రూపొందించారు.

నీల‌ముడి మూవీలో మ‌జీద్ హ‌నీఫా, శ్రీనాథ్‌, సుబ్ర‌మ‌ణియ‌న్‌, అచ్యుతానంద‌న్ కీల‌క పాత్ర‌లు పోషించారు. రెగ్యుల‌ర్ సినిమాల‌కు భిన్నంగా వ్లోగ్ వీడియోస్ ఫార్మెట్‌లో చేస్తున్న‌ట్లుగా ప్ర‌యోగాత్మ‌కంగా ద‌ర్శ‌కుడు ఈ సినిమాను తెర‌కెక్కించారు.

నీల‌ముడి మూవీ ర‌న్‌టైమ్ 80 నిమిషాలు మాత్ర‌మే కావ‌డం గ‌మ‌నార్హం. ఈ సినిమా ఇంట‌ర్నేష‌న‌ల్ ఫిల్మ్ ఫెస్టివ‌ల్ ఆఫ్ కేర‌ళ‌తో పాటు ప‌లు ఫిలిం ఫెస్టివ‌ల్స్‌లో స్క్రీనింగ్ అయ్యింది. కోటి రూపాయ‌ల లోపే బ‌డ...