భారతదేశం, జనవరి 28 -- Malayalam OTT: మ‌హేష్‌బాబు మ‌హ‌ర్షి ఫేమ్ అన‌న్య హీరోయిన్‌గా న‌టించిన మ‌ల‌యాళం మూవీ స్వ‌ర్గం ఓటీటీ ప్లాట్‌ఫామ్ క‌న్ఫామ్ అయ్యింది. మ‌నోర‌మా మ్యాక్స్ ద్వారా త్వ‌ర‌లో ఈ ఫ్యామిలీ డ్రామా మూవీ ఓటీటీ ప్రేక్ష‌కుల ముందుకు రాబోతోంది.

ఈ విష‌యాన్ని ఓటీటీ ప్లాట్‌ఫామ్ అధికారికంగా ప్ర‌క‌టించింది. ఫిబ్ర‌వ‌రి ఫ‌స్ట్ వీక్‌లో మ‌నోర‌మా మ్యాక్స్‌లో స్వ‌ర్గం మూవీ రిలీజ్ కానున్న‌ట్లు చెబుతోన్నారు. ఫిబ్ర‌వ‌రి 7 నుంచి స్ట్రీమింగ్ అయ్యే అవ‌కాశం ఉన్న‌ట్లు ప్ర‌చారం జ‌రుగుతోంది.

స్వ‌ర్గం మూవీలో అన‌న్య‌తో పాటు అజు వ‌ర్గీస్‌, జాన్ ఆంటోనీ, మంజు పిల్లై కీల‌క పాత్ర‌లు పోషించారు. ఇర‌వై మందికిపైగా మ‌ల‌యాళం సీనియ‌ర్ ఆర్టిస్టులు ముఖ్య పాత్ర‌ల్లో క‌నిపించారు. స్వ‌ర్గం మూవీకి రెజీస్ ఆంటోనీ ద‌ర్శ‌క‌త్వం వ‌హించాడు. నాలుగు కోట్ల బ‌డ్జెట్‌తో చిన్న సినిమాగా రి...