భారతదేశం, మార్చి 29 -- మంజుమ్మెల్ బాయ్స్ ఫేమ్ సౌబీన్ షాహిర్ హీరోగా న‌టించిన మ‌ల‌యాళం కామెడీ థ్రిల్ల‌ర్ మూవీ మాచంటే మాల‌ఖ రెండు ఓటీటీల‌లో రిలీజ్ అవుతోంది. ఈ మ‌ల‌యాళం మూవీ స్ట్రీమింగ్ హ‌క్కుల‌ను అమెజాన్ ప్రైమ్ వీడియోతో పాటు సైనా ప్లే ఓటీటీ సొంతం చేసుకున్న‌ది. త్వ‌ర‌లోనే మాచంటే మాల‌ఖ మూవీ ఓటీటీలోకి రాబోతున్న‌ట్లు సైనా ప్లే ఓటీటీతో పాటు అమెజాన్ ప్రైమ్ ప్ర‌క‌టించాయి. ఏప్రిల్ ఫ‌స్ట్ వీక్ నుంచి రెండు ఓటీటీల‌లో ఈ మూవీ స్ట్రీమింగ్ కానున్న‌ట్లు ప్ర‌చారం జ‌రుగుతోంది.

మాచంటే మాల‌ఖ మూవీలో సౌబీన్ షాహిర్‌తో పాటు న‌మితా ప్ర‌మోద్‌, ధ్యాన్ శ్రీనివాస‌న్‌, దిలీష్ పోత‌న్ కీల‌క పాత్ర‌ల్లో న‌టించారు. ఈ సినిమాకు బోబ‌న్ శామ్యూల్ ద‌ర్శ‌క‌త్వం వ‌హించాడు. ఫిబ్ర‌వ‌రి నెలాఖ‌రున థియేట‌ర్ల‌లో రిలీజైన ఈ మ‌ల‌యాళం మూవీ నెగెటివ్ టాక్‌ను మూట‌గ‌ట్టుకున్న‌ది. సౌబీన్ షాహిర్ కె...