భారతదేశం, జనవరి 25 -- Malayalam OTT:మ‌ల‌యాళం మూవీ పార్ట్‌న‌ర్స్ ఓటీటీలోకి వ‌స్తోంది. క్రైమ్ థ్రిల్ల‌ర్ క‌థాంశంతో తెర‌కెక్కిన ఈ మూవీలో ధ్యాన్ శ్రీనివాస‌న్‌, క‌ళాభ‌వ‌న్ షాజాన్‌, రోనీ డేవిడ్‌తో పాటు బిచ్చ‌గాడు ఫేమ్ సాట్నా టైట‌స్ ప్ర‌ధాన పాత్ర‌లు పోషించారు. ఈ మూవీ సైనా ప్లే ద్వారా ఓటీటీ ప్రేక్ష‌కుల ముందుకు వ‌స్తోంది. జ‌న‌వ‌రి 31 నుంచి పార్ట‌న‌ర్స్ మూవీ సైనా ప్లేలో స్ట్రీమింగ్ కానున్న‌ట్లు స‌మాచారం.

గ‌త ఏడాది జూలైలో థియేట‌ర్ల‌లో రిలీజైన పార్ట్‌న‌ర్స్‌ మూవీ బాక్సాఫీస్ వ‌ద్ద యావ‌రేజ్‌గా నిలిచింది. థియేట‌ర్ల‌లో రిలీజైన ఏడు నెలల త‌ర్వాత ఓటీటీలోకి వ‌స్తోంది. పార్ట్‌న‌ర్స్ సినిమాకు న‌వీన్ జాన్ ద‌ర్శ‌క‌త్వం వ‌హించాడు. 1990, 2024... రెండు టైమ్ పీరియ‌డ్స్ బ్యాక్‌డ్రాప్‌లో బ్యాంక్‌ స్కామ్స్ చుట్టూ ద‌ర్శ‌కుడు ఈ క‌థ‌ను న‌డిపించాడు. ఐదుగురు స్నేహితులు త‌మ...