భారతదేశం, ఫిబ్రవరి 12 -- మ‌ల‌యాళం రొమాంటిక్ డ్రామా మూవీ మ‌నోరాజ్యం థియేట‌ర్ల‌లో రిలీజైన ఏడు నెల‌ల త‌ర్వాత ఓటీటీలోకి వ‌స్తోంది. వాలెంటైన్స్ డే కానుక‌గా మ‌నోర‌మా మ్యాక్స్ ఓటీటీలో ఈ మూవీ స్ట్రీమింగ్ కాబోతోంది. మ‌నోరాజ్యం మూవీలో అల వైకుంఠ‌పుర‌ములో ఫేమ్‌ గోవింద్ ప‌ద్మ‌సూర్య‌, ర‌జిత మీన‌న్ హీరోహీరోయిన్లుగా న‌టించారు. న‌వాస్‌, గోకుల‌న్‌, య‌శ్వి కీల‌క పాత్ర‌లు పోషించారు. ర‌షీద్ ప‌రాక్కాల్ ద‌ర్శ‌క‌త్వం వ‌హించారు.

గ‌త ఏడాది ఆగ‌స్ట్‌లో థియేట‌ర్ల‌లో మ‌నోరాజ్యం మూవీ రిలీజైంది. పాజిటివ్ టాక్‌ను సొంతం చేసుకున్న‌ది. ఐఎమ్‌డీబీలో ఈ మూవీ 9.1 రేటింగ్‌ను సొంతం చేసుకున్న‌ది. కాన్సెప్ట్‌, ప్రొడ‌క్ష‌న్ వ్యాల్యూస్‌తో పాటు హీరోహీరోయిన్ల యాక్టింగ్ బాగుంద‌నే ప్ర‌శంస‌లు వ‌చ్చాయి. భార్యాభ‌ర్త‌ల బంధాన్ని రొమాంటిక్‌, బోల్డ్ అంశాల‌తో మోడ్ర‌న్ స్టైల్‌లో డైరెక్ట‌ర్ ఈ మూవీ...